దండమూడి చిత్రం ప్రారంభం

కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. అంజీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆకాష్ పూరి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత భాస్క‌ర భ‌ట్ల స్క్రిప్ట్‌ను అందించారు.

‘‘ఈ సినిమాను హైద‌రాబాద్‌, బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మా ప్లాన్‌,” అన్నారు నిర్మాత దండ‌మూరి అర‌వింద్ కుమార్ .

“నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ల‌వ్‌, యాక్ష‌న్‌, క్రైమ్ డ్రామా. కొత్త‌గా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్ అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను,” అని అన్నారు హీరో కార్తీక్ రాజు.

“న‌వంబ‌ర్ 14 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాల‌నేది ప్లాన్‌. హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ త్వ‌రిత స‌హా మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు దర్శకుడు అంజీ రామ్.

 

More

Related Stories