దసరాకి సరదా తీరుతుంది!

- Advertisement -
Dasara 2023

దసరా పండక్కి పోటీ మాములుగా లేదుగా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నాం అని నాలుగు చిత్రాలు హడావిడిగా విడుదల తేదీల పోస్టర్లని విడుదల చేశాయి.

హీరో రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కానీ అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు. దసరా స్పెషల్ గా అక్టోబర్ 20న విడుదల చేస్తామని అంటున్నారు.

బరిలో బాలయ్య
తాజగా బాలకృష్ణ కూడా దసరా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బాలయ్యతో దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాకి కూడా ఇంకా పేరు పెట్టలేదు. ఈ సినిమాని విజయ దశమికి విడుదల చేయబోతున్నట్లు ఈ రోజు ప్రకటించారు.

ఈ రెండు చిత్రాలతో పాటు రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’, తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తోన్న ‘లియో’ చిత్రం కూడా దసరా బరిలో ఉన్నాయి. విజయ్ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. తెలుగులో అదే పేరుతో డబ్ కానుంది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న రానుంది.

ఐతే, ఇందులో ఒకటో రెండు చిత్రాలు వెనక్కి తగ్గడం గ్యారెంటీ. ఆగస్టులో ఈ సినిమాల విడుదల విషయంలో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఈ నాలుగు చిత్రాలు దసరాకి కర్చీఫ్ వేశాయి.

 

More

Related Stories