దసరాకి ముందే భారీ లాభాలు

Dasara


నాని హీరోగా నటించిన కొత్త చిత్రం… దసరా. టీజర్ విడుదల తర్వాత సినిమాపై హైప్ పెరిగింది. షూటింగ్ దశలోనే ఈ సినిమాకి సంబందించిన అన్నీ థియేటర్ హక్కులను చదలవాడ బ్రదర్స్ భారీ మొత్తానికి కొన్నారు. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు వారి దగ్గరి నుంచి ఇంకా ఎక్కువకి కొన్నారు.

ఇక ‘దసరా’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తారు. నాని గెటప్, సినిమా కథ, దాని సెటప్ కొత్తగా ఉన్నాయట. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంగా సాగే ఈ సినిమాలో నాని మొదటిసారిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్తున్నాడు. లుక్ కూడా మొత్తం మార్చేశాడు.

‘లోకల్’ కథలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ‘కాంతార’ వంటి సినిమాల సక్సెస్ ప్రూవ్ చేస్తోంది. అందుకే, ‘దసరా’కి ఇంత హైప్ వచ్చింది.

నాని కెరీర్ లో ఇది భారీగా తీసిన సినిమా. ఐతే, నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా భారీగా డబ్బు వచ్చింది. ఆ విధంగా మేకర్స్ కి ఇది విడుదలకు ముందే లాభాలు చూపిస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం ఇచ్చారు.

 

More

Related Stories