దాసరి ఆస్తులపై మరోసారి రచ్చ

Dasari Narayana Rao

టాలీవుడ్ పెద్దమనిషిగా, లెజెండ్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు.. మరణించిన తర్వాత కూడా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. దానికి కారణం ఆయన ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం గొడవ పడ్డమే. ఇప్పటికే ఎన్నోసార్లు ఆస్తి విషయంలో గొడవ పడిన అన్నదమ్ములు మరోసారి రచ్చకెక్కారు.

దాసరి పెద్ద కొడుకు ప్రభు, మరోసారి తన తమ్ముడు అరుణ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి వీలునామా ప్రకారం, ఆయన ఇంట్లో తను ఉంటున్నానని అరుణ్ కుమార్ గొడవ చేస్తున్నాడని ప్రభు ఆరోపిస్తున్నారు.

మొన్న (బుధవారం) రాత్రి అరుణ్ కుమార్, ప్రభు ఇంటికి (ఒకప్పుడు దాసరి నివశించిన ఇల్లు) వచ్చాడట. గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించి, ప్రభును, ఆమె భార్యను దుర్భాషలాడాడట. ప్రభు అత్తమామల్ని కూడా తిట్టాడట. ఆ టైమ్ లో అరుణ్ కుమార్ భార్య కూడా ఉన్నారని, ఆమె కూడా తిట్ల వర్షం కురిపించారని ఆరోపిస్తూ ప్రభు పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.

తమ అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి గొడవలపై మురళీమోహన్, మోహన్ బాబు, సి.కల్యాణ్ లాంటి వ్యక్తులు జోక్యం చేసుకోవాలని ప్రభు డిమాండ్ చేస్తున్నాడు. ప్రభు తమకు కంప్లయింట్ ఇచ్చిన విషయాన్ని జూబ్లిహిల్స్ పోలీసులు నిర్థారించారు.

Related Stories