‘బిచ్చగాడు 3’కి డేట్ ఫిక్స్

Bichagadu 2

‘బిచ్చగాడు’ చితం 2016లో వచ్చింది. అదొక సంచలన విజయం. తాజాగా ‘బిచ్చగాడు 2’ విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగంలా భారీ హిట్ కాదు కానీ మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగులో కొన్నవాళ్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. దాంతో, మూడో భాగంపై ఆసక్తి మొదలైంది.

‘బిచ్చగాడు’ హీరో, నిర్మాత విజయ్ ఆంటోని ఇప్పటికే మూడో భాగం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి డేట్ కూడా ఫిక్స్ చేశారు.

“బిచ్చగాడు 3 షూటిం గ్‌ 2025లో ప్రారంభమవుతుంది. 1, 2 సినిమా కథలకు సంబంధం ఉండదు. మొదటి భాగంలో అమ్మ సెంటిమెంట్, రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ పెట్టాం. మూడో భాగంలో ఏమి చూపిస్తాం అనేది ఇప్పుడే చెప్పకూడదు. బిచ్చగాడు 2 భాగం తీయడానికి ఆరేళ్ళు పట్టింది. కానీ మూడో భాగానికి ఎక్కువ టైం తీసుకోవడం లేదు. 2025లోనే ప్రారంభించి అదే ఏడాది విడుదల చేస్తాం,” అని విజయ్ ఆంటోని తెలిపారు.

రెండో భాగానికి దర్శకుడు కూడా విజయ్ ఆంటోని. ఐతే, మూడో దానికి అయినా మంచి దర్శకుడిని పెట్టుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
 

More

Related Stories