
ఈ రోజుల్లో సినిమా లెంగ్త్ ఎక్కువుంటే జనం బోర్ ఫీల్ అవుతున్నారు. రెండున్నర గంటలకి పైగా థియేటర్లో కూర్చునే ఓపిక లేదు. పెద్ద స్టార్ లు నటించే సినిమాలకు నిడివి ఎక్కువున్నా పర్వాలేదు. కానీ, చిన్న చిత్రాల కథనం సూటిగా, స్వీట్ గా ఉండాలి. ‘డియర్ మేఘ’ దర్శక, నిర్మాతలు ఇదే సూత్రాన్ని పాటించారు.
‘డియర్ మేఘ’ ఒక ఫ్రెష్ స్టోరీ అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుందట. ఆ విధంగా దర్శకుడు సినిమాని ప్రెజంట్ చేశాడట. నేటి ట్రెండ్ కు అనుగుణంగా కేవలం 2 గంటల 5 నిమిషాల్లో సినిమా పూర్తి అవుతుంది. తక్కువ నిడివి ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సుశాంత్ రెడ్డి.
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
“నా పేరు మీద గతంలో ఓ పాట వచ్చింది. ఇప్పుడు ఓ సినిమా రూపొందడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ,” అని చెప్పారు మేఘా ఆకాష్.
Also Check: Megha Akash at Dear Megha promotions