సెప్టెంబర్ 3న రానున్న ‘డియర్ మేఘ’

థియేటర్లలో విడుదలకు సినిమాలన్నీ వరుస కడుతున్నాయి. మేఘా ఆకాష్ నటించిన రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి. శ్రీ విష్ణు సరసన ఆమె నటించిన ‘రాజ రాజ చోర’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఇక వచ్చే నెలలో ఆమె నటించిన మరో సినిమా రానుంది.

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ జంటగా రూపొందిన ప్రేమకథా చిత్రం… ‘డియర్ మేఘ’. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్ లలో విడుదల కానుంది.
థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ”డియర్ మేఘ” కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చెప్తున్నారు.

ఇది ఒక ఎమోషనల్ ప్రేమకథగా మలిచామని అంటున్నారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్ర పోషించారు.

 

More

Related Stories