
‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం “దీపావళి. దీపావళి పండగ సందర్భంగా ఈ శనివారం (నవంబర్ 11న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
”కొట్టు కొట్టు విజిల్ కొట్టు.. బాధలన్నీ పక్కనెట్టు… వచ్చే వచ్చే దీపావళి” అంటూ సాగిన ఈ గీతానికి గోసాల రాంబాబు సాహిత్యం అందించగా… థీసన్ సంగీతం అందించారు. పండగ ప్రత్యేకత తెలిపేలా ఈ పాట సాగింది.
తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ‘దీపావళి’ ప్రీమియర్ షోలు వేశారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు మీడియా ప్రముఖుల ప్రశంసలు ఈ సినిమా అందుకుంది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలు, అనుబంధాలను హైలైట్ చేస్తూ… భావోద్వేగభరితంగా సినిమా సాగిందని, ముఖ్యంగా తాత – మనవడు, మనవడు – మేక పిల్ల మధ్య సన్నివేశాలు కంటతడి పెట్టించాయని చాలా మంది ప్రశంసించారు.
పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ఏ వెంకట్ డైరెక్టర్.