లేడి సింగంగా దీపిక

‘సింగం’ సినిమాలకున్న క్రేజ్ వేరు. సింగం సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. ఈ సిరీస్ లో మరో చిత్రంగా … “సింగం అగైన్” రానుంది. ఇందులో లేడి సింగంగా దీపిక పదుకోన్ నటిస్తుంది. విషయాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా ప్రకటించారు.

అజయ్ దేవగన్ హీరోగా సింగం చిత్రాల సిరీస్ తీస్తూ వస్తున్నారు రోహిత్ శెట్టి. దానికి సమాంతరంగా “శింబ”, “సూర్యవంశీ” వంటి పోలీస్ చిత్రాలు తీశారు రోహిత్ శెట్టి. ఇప్పుడు ‘సింగం అగైన్” పేరుతో సింగం సిరీస్ లో మూడో చిత్రం తీసుకురానున్నారు.

తమిళంలో సూర్య నటించిన ‘సింగం’ సినిమాకి రీమేక్ గా హిందీలో అదే పేరుతో మొదట రీమేక్ అయింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి తనదైన పద్దతిలో హిందీలో ఈ ఖాకీ చిత్రాల యూనివర్స్ ని క్రియేట్ చేసుకొని ఒక సక్సెస్ ఫార్ములా సృష్టించుకున్నారు.

దీపికకి యాక్షన్ చిత్రాలు కొత్త కాదు. కానీ సింగం పోలీసుగా నటించడం ప్రత్యేకం.

 

More

Related Stories