ఇక దీపిక బికినీ షో కొంతే!


దీపిక పదుకోన్, షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలోని ఒక పాట ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ట్యూన్ బాగుంది. దానికన్నా ఈ పాటలో దీపిక చేసిన అందాల షో కనువిందు చేసింది. దాంతో, ఇన్ స్టాంట్ గా క్రేజ్ తెచ్చుకొంది. దాంతో పాటు వివాదాలు కూడా మూటగట్టుకొంది.

ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ పాటని టార్గెట్ చేశారు. ఈ పాటలో దీపిక రకరకాల బికినీల్లో దర్శనమిచ్చింది. ఒక బికినీ రంగు కాషాయం. హిందువులకు పవిత్రమైన కాషాయం రంగు బికినీ ధరించడంతో ఒక బీజేపీ మంత్రి, కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ పాట పూర్తిగా రాజకీయ వివాదాల్లో చిక్కుకొంది.

దాంతో, సెన్సార్ బోర్డు కూడా ఈ సాంగ్ విషయంలో అభ్యంతరాలు తెలిపి ఆ షాట్స్ ని తొలగించాలని చెప్పింది. భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారిగా ఒక డ్రెస్ కలర్ కి ‘సెన్సార్ కట్’ పడడం ఇదే మొదటిసారి.

ఐతే, ఈ సినిమా హీరో షారుక్ ఖాన్ ఆ సాఫ్రాన్ బికినీ షాట్స్ తో పాటు దీపిక ప్రదర్శించిన అనేక బికినీ అందాలకు కత్తెర వేయాలని నిర్ణయించాడట. ఇప్పటికే హిందీ సినిమాలు ‘బ్యాన్’ ట్రెండింగ్ లతో సతమమవుతున్నాయి. పైగా, షారుక్ ని బీజేపీ టార్గెట్ చేసింది. అందుకే, షారుక్ కొంత రాజీ పడినట్లు టాక్. ఈ పాటలో దీపిక బికిని షో తక్కువ కనిపిస్తుంది.

Pathaan

‘పఠాన్’ ఈ నెల 25న విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగులో కూడా పెద్ద ఎత్తున విడుదల అవుతుంది.

 

More

Related Stories