దీపిక గెస్ట్ రోల్స్!

Deepika

దీపిక పదుకోన్ బాలీవుడ్లో అగ్రతార. ఆమె ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. హీరోయిన్లలో నెంబర్ వన్. ఐతే, ఎవరైనా మిత్రులు అతిథిగా తమ సినిమాల్లో కనిపించమని కోరితే ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకుంటుంది. డబ్బులు కూడా తీసుకోదట.

తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ భారీ చిత్రం ‘బ్రహ్మస్త్ర’లో ఆమె గెస్ట్ గా నటించింది. రణబీర్ కోసం ఆమె ఒప్పుకొంది. ఇక తాజాగా తన గురువు షారుక్ కొత్త సినిమా ‘జవాన్’లో కూడా చిన్న పాత్ర పోషించనుందట. షారుక్ కాబట్టి వెంటనే అంగీకరించింది. షారుక్ తో ఆమె ఇప్పటికే ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్సప్రెస్’ వంటి హిట్ చిత్రాలు చేసింది.

దీపిక ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో నటిస్తోంది. అది 2024లో విడుదల కానుంది. హిందీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు కూడా వచ్చే ఏడాదే విడుదల అవుతాయి.

ఈ గ్యాప్ లో ఆమె గెస్ట్ రోల్స్ తో బిజీగా ఉందన్నమాట.

మరోవైపు, ఇటీవల ఆమె హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐతే, ఆమెకి ఎలాంటి సమస్యలు లేవని టీం తెలిపింది. అంతకుముందు వచ్చిన కోవిడ్ కారణంగా వచ్చిన చిన్న సమస్య వల్ల దీపిక హెల్త్ చెకప్ కి వెళ్లిందట. అంతకుమించి మరో సమస్య లేదని ఆమె టీం చెప్పింది.

 

More

Related Stories