స్వయంగా సరుకులు కొన్న దీపిక!


దీపిక పదుకోన్… ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్. సినిమాకి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఏకైక ఇండియన్ హీరోయిన్. ఆమెకి ఎందరో పనివాళ్ళు ఉన్నారు. ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చిపెట్టేస్తారు. అలాంటి భామ… ఇంట్లోకి కావాల్సిన పప్పు, ఉప్పు… ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు స్వయంగా కొనేందుకు సూపర్ మార్కెట్ వెళ్తుందా? కానీ దీపిక అలా చేసి సర్ప్రైజ్ చేసింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే నిన్న దీపిక ముంబైలోని ఒక పెద్ద సూపర్ మార్కెట్ లో స్వయంగా సరుకులు కొంటూ మీడియా కెమెరా కంటికి చిక్కింది. రెండు బ్యాగుల నిండా సరుకులు షాపింగ్ చేసి, తనే మోసుకుంటూ వెళ్ళింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఐతే, షూటింగ్ లేని టైంలో షాపింగ్ చెయ్యడం ఆమెకి సరదా. ఇంట్లో వీలైనంత వరకు తనే వంట చేస్తుందట. షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే పనివారి సాయం తీసుకుంటుంది. మిగతా టైంలో వంట, ఇంటి పని తనే దగ్గరుండి చెయ్యడం, చేయించడం అంటే ఇష్టమంట.

More

Related Stories