దీపికా పదుకోన్ చేతిలో ఆరు

Deepika

దీపిక పదుకోను మళ్ళీ బిజీ అయిపోయింది. ఆమె చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయిప్పుడు. మరి ప్రభాస్ సినిమాకి అనుకున్న టైంకి డేట్స్ ఇవ్వగలదా అన్నదే డౌట్.

దీపిక పదుకోన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. అలాగే, సినిమాలు ఒప్పుకోవడం తగ్గించింది. ఇప్పుడు 2021లో దూకుడు పెంచుతోంది. ఈ ఆరు సినిమాలు ఈ ఏడాది, వచ్చే ఏడాది విడుదల అవుతాయి. మొన్నామధ్య దీపిక కూడా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే, ఈ వివాదం ఆమెకి ఎలాంటి బ్యాడ్ ఇమేజ్ తీసుకురాలేదు. అదంతా ఒక పొలిటికల్ గేమ్ అని అందరికి తెలుసు.

సో, ఇప్పుడు దీపిక తనకి ఇంకా క్రేజ్ ఉందని ప్రూవ్ చేసుకుంటోంది. బహుశా అందుకే అరడజన్ సినిమాలు సైన్ చేసింది.

  1. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ డైరెక్క్షన్లో మూవీ
  2. హృతిక్ రోషన్ తో “ఫైటర్”
  3. షారుక్ హీరోగా “పఠాన్”
  4. శకున్ బాత్రా డైరెక్షన్లో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా ఒక రొమాంటిక్ డ్రామా
  5. మహాభారత్
  6. ఒక హాలీవుడ్ మూవీ రీమేక్

More

Related Stories