
దీపిక పదుకోన్ కూడా “డిషుమ్ డిషుమ్” పాత్రలపై ఫోకస్ పెట్టినట్లుంది. ఆమె మరో యాక్షన్ రోల్ చేస్తోంది. అదీ కూడా పోలీస్ అవతారంలో.
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఆమెని ఇంతకుముందు చెన్నయ్ పొన్నుగా చూపించారు “చెన్నై ఎక్స్ ప్రెస్” చిత్రంలో. ఇప్పుడు పోలీస్ గా చూపించనున్నారు.
రోహిత్ శెట్టి తాజాగా తీస్తున్న మూవీ… సింగం అగైన్. ఇంతకుముందు “సింగం”, “సింగం రిటర్న్స్,” తీసిన రోహిత్ శెట్టి కలిసొచ్చిన ఈ సిరీస్ లో మరో చిత్రం తీస్తున్నాడు. అదే “సింగం అగైన్”. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, రణవీర్ సింగ్ లతో పాటు దీపిక నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కూడా హీరోల మాదిరిగానే యాక్షన్ రోల్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది.
దీపిక పదుకోన్ తెలుగులో ప్రభాస్ సరసన “కల్కి”లో కూడా నటిస్తోంది. ఈ ఏడాది ఈ భామ ఇప్పటికే “పఠాన్”, “జవాన్” చిత్రాల్లో నటించి విజయాలు అందుకొంది. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే భామ దీపికనే.