దీపిక డేట్స్ పూర్తిగా వేస్ట్ అయినట్లే

- Advertisement -
Deepika Padukone

దీపిక పదుకొనె తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రభాస్ సరసన నటించనుంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తీయనున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక, లెజెండరీ యాక్టర్ అమితాబ్ నటించేందుకు ఒప్పుకున్నారు. ఐతే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతోంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుందని ఇప్పటికే తెలుగుసినిమా.కామ్ రాసింది. దీపిక పదుకోన్ జులై 2021 నుంచి డేట్స్ ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు అవి అవసరం పడవు. ఈ ఏడాది మొత్తంగా ఆమె డేట్స్ ని వాడలేరు. మరి నెక్స్ట్ ఇయర్ ఆమెని తమ సినిమా షూటింగ్ కి రప్పించాలంటే టీం కొంచెం కష్టపడాలి.

ప్రస్తుతం ఆమె హిందీలో మూడు సినిమాలు ఒప్పుకొంది.

 

More

Related Stories