దీపిక అందుకే డిలీట్ చేసిందట

Deepika Padukone

దీపిక పదుకోన్ కొత్త ఏడాది మొదటి రోజు అందరికి షాక్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఇన్నేళ్ళుగా పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలన్నీ రిమూవ్ చేసింది. ఒక్క ఫోటో కూడా ఉంచలేదు. అన్ని తీసేసిన తర్వాత ఒక ఆడియో పోస్ట్ పెట్టింది. “2020 అందరికి ఒక అనిశ్చితిని క్రేయేట్ చేసింది. 2021లో ఆరోగ్యం బాగుండాలని, మంచి జరగాలి అని కోరుకుంటున్నా. ఈ ఆడియో డైరీలో నా ఆలోచనలు, అభిప్రాయాలుంటాయి,” అని చెప్పింది.

ఇప్పుడు దీపిక పదుకోన్ పాత ఫోటోలు మనం చూడలేం.

తన పేరును డ్రగ్స్ కేసులో ఇరికించడంతో దీపిక బాగా ఫీల్ అయిందట. అందుకే 2021ని లైఫ్ ని “ఫ్రెష్”గా స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయింది. పాత ఫోటోలు, వీడియోలు వెలికితీసి… ఎలాంటి వివాదం సృష్టిస్తారో అని భయపడిందట. ఇకపై పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు అన్ని కేర్ ఫుల్ గా పరిశీలించి పోస్ట్ చేస్తుందట.

అందుకే క్లీన్ అండ్ గ్రీన్ మొదలుపెట్టింది. 2021లో న్యూ స్టార్ట్ అన్నమాట.

దీపిక త్వరలోనే తెలుగులో అడుగుపెట్టనుంది. ఆమె ప్రభాస్ సరసన నటిస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో ఆమె హీరోయిన్. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలోపు ఏమైనా జరగొచ్చు. ఇంతకుముందు ఈ సినిమాని మార్చిలో మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ ఇప్పుడు “సలార్”, “ఆదిపురుష్” అనే మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమా షురూ చేస్తాడు.

More

Related Stories