ఆ ఆలోచన ఇప్పుడే లేదు

- Advertisement -


దీపిక పదుకోన్ నటించిన హిందీ చిత్రం ‘గెహరాయియా’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆమె ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వెల్లడిస్తోంది.

ఈ సినిమా కథలో ‘ప్రెగ్నన్సీ’ కూడా ఒక కీలకమైన భాగం. అందుకే, మీడియా మరి రియల్ లైఫ్ లో తల్లి ఎప్పుడు కాబోతున్నారు అని ఆమె అడుగుతున్నారు. “పిల్లల ఆలోచన ఇప్పుడే లేదని,” తేల్చి చెప్పింది. అంతే కాదు, ఆ మాట అన్న వెంటనే, “ఏమో కొన్ని అనుకోకుండా జరిగిపోతాయేమో,” అని కూడా చెప్పింది.

దీపిక పదుకోన్ వయసు 36. 2018లో ఆమె హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడింది. పెళ్ళై నాలుగేళ్లు అవుతోంది. దాంతో, పిల్లల గురించి సహజంగానే టాపిక్ వస్తుంది కదా. ఐతే, ఆమె వరుసగా సినిమాలు కూడా చేస్తుండడంతో ఆ ఆలోచనలో ఇప్పుడు లేనట్లు అనిపిస్తోంది.

దీపిక ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ చిత్రంలో నటిస్తోంది.

నటిగా ఆమె మంచి పరిణితి సాధించింది. ‘గెహరాయియా’ సినిమాకి ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. రివ్యూస్ అన్ని బ్యాడ్ గానే ఉన్నాయి. ఐతే, దీపిక నటనకి మాత్రం అందరూ A గ్రేడ్ మార్కులు వేశారు.

పెళ్ళైన తర్వాత అంత హాట్ గా నటించాలా అన్న విమర్శలను కూడా పట్టించుకోను అంటోంది. సినిమాకి, పాత్రకి ఏమి కావాలో అది చేస్తాను. ఇతరులు తనకి హద్దులు గీయొద్దు అని సూచిస్తోంది.

 

More

Related Stories