దీపిక ఇక మెటర్నిటీ లీవులో

- Advertisement -
Deepika Padukone

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ తల్లి కాబోతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో డెలివరీ అని దీపిక ఇటీవల ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఆమె మెటర్నిటీ లీవ్ లో ఉండనుంది.

“కల్కి 2898 AD” సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా ప్రమోషన్ కి ఆమె రావడం డౌటే. ఎందుకంటే మే 9న ఈ సినిమా విడుదల కానుంది. అప్పటికి ఆమె 5 నెలలో పడుతుంది. అంటే ఆమె ఆ సమయంలో ప్రమోషన్ లకు రాకపోవచ్చు.

అలాగే, ఆమె నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రం “సింగం ఎగైన్”. ఆ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. అది సరిగ్గా డెలివరీకి నెల రోజుల ముందు సమయం. సో, ఆమె ఆ సినిమా ప్రొమోషన్ కి కూడా రాదు.

అలాగే, ఇంతకుముందు ఒప్పుకోవాలనుకున్న పలు సినిమాలను వదులుకొంది. ఈ ఏడాది పూర్తిగా ఆమె సినిమాలకు దూరం.

 

More

Related Stories