
దీపిక పదుకోను దేశంలో నెంబర్ వన్ హీరోయిన్. సినిమాకి 15 కోట్లు పైనే తీసుకునే ఏకైక హీరోయిన్. 2023లో ఆమె షారుక్ ఖాన్ సరసన రెండు చిత్రాల్లో నటించింది. అవి “పఠాన్”, “జవాన్”. రెండూ సూపర్ డూపర్ హిట్టాయ్య్యాయి.
“పఠాన్” జనవరి 25, 2023న విడులైంది. ఈ ఏడాది బాలీవుడ్ లో మొదటి హిట్ మూవీ… “పఠాన్”. అలా 2023లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ అనిపించుకొంది . 2024లో కూడా ఆమె నటించిన చిత్రమే బోణి కొట్టేలా ఉంది.
2024 జనవరిలో పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి. కానీ కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి విడుదలవుతున్న మొదటి బడా చిత్రం …ఫైటర్. ఇందులో హీరో హృతిక్ రోషన్. ఈ సినిమా కూడా రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది. ఈ ఏడాది రిపబ్లిక్ డేకి ఆమె సినిమా వచ్చింది. వచ్చే రిపబ్లిక్ డేకి కూడా ఆమె సినిమా వస్తోంది. అందులో షారుక్ హీరో, ఇందులో హృతిక్ హీరో. దర్శకుడు (సిద్ధార్థ్ ఆనంద్), హీరోయిన్ (దీపిక) మాత్రం కామన్.
ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలను చూస్తుంటే మళ్ళీ కొత్త ఏడాదిలో (2024) తొలి హిట్ దీపిక ఖాతాలోనే పడేట్లు ఉంది.
ఈ సినిమాలో ఆమె ఎయిర్ ఫోర్స్ కి చెందిన వార్ పైలట్ గా నటించింది. అటు సోల్జర్ గా విన్యాసాలు, ఇటు గ్లామర్ సోయగాలతో ఆమె మరోమారు ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా ఉంది.

“ఫైటర్” కూడా బ్లాక్ బస్టర్ అయితే వరుసగా రెండేళ్లు తనదే హహ అని నిరూపించుకున్నట్లే. దీపిక 2024లో “ఫైటర్”తో పాటు ప్రభాస్ మూవీ “కల్కి”తో ప్రేక్షకులను పలకరించనుంది.