గ్లోబల్ అవార్డులకు దీపిక అట్రాక్షన్!

- Advertisement -

దీపిక పదుకోన్ బాలీవుడ్ హీరోయినే కానీ ఆమెకి హాలీవుడ్ లో కూడా గుర్తింపు ఉంది. గ్లోబల్ సినిమా వేదికపై తరుచుగా మెరిసే ఏకైక బాలీవుడ్ భామ దీపిక.

గతేడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి దీపిక హాజరైంది. “ఆర్ ఆర్ ఆర్” గురించి ఆస్కార్ అవార్డుల వేదికపై మాట్లాడింది. అలాగే తాజాగా జరిగిన బాప్టా (బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డ్స్) 2024 అవార్డుల కార్యక్రమానికి కూడా ఇండియా నుంచి హాజరయిన భామ దీపిక మాత్రమే.

హాలీవుడ్, బాఫ్తా, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఇలా పేరొందిన గ్లోబల్ సినిమా కార్యక్రమాల్లో భారతీయ సినిమా నుంచి తప్పకుండా మెరుస్తున్న హీరోయిన్ దీపిక. ఆమెని గ్లోబల్ స్టార్ గా గుర్తిస్తున్నాయి అక్కడి సంస్థలు. అందుకే ఆమెని ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఆహ్వానాలు వస్తున్నాయి.

మరోవైపు, దీపిక పదుకోన్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన నటిస్తోంది. “కల్కి 2898AD” షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. ఈ కొత్త షెడ్యూల్ లో దీపిక పాల్గొననుంది.

ALSO CHECK: Deepika Padukone dazzles in a sari

 

More

Related Stories