దీపిక ఆ పని చేసినందుకేనా!

డ్రగ్స్ కేసులో అనూహ్యంగా దీపికా పదుకొనే పేరు వచ్చింది. ఆమె తన మేనేజర్ కి వాట్సాప్ లో డ్రగ్స్ తీసుకురమ్మని చాట్ చేసినట్లు బయటపడిందట. ఐతే, సడెన్ గా దీపికా పదుకొనే పేరు బయటికి రావడం వెనుక ఒక రీజన్ ఉంది అనే వాదన వినిపిస్తోంది. బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకోని హీరో, హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు. బాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ కన్సుమప్షన్ (వినియోగం) అనేది సర్వసాధారణం అనేది ఓపెన్ సీక్రెట్.

పర్టికులర్ గా దీపికా పేరు బయట పెట్టడానికి రీజన్ మాత్రం …ఆమె గతంలో చేసిన ఒక పని వల్లే అని అంటున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్ లో ఢిల్లీలోని జెఎన్ యూ విద్యార్థులు చేసిన ధర్నాకి మద్దతు తెలుపుతూ దీపికా వారి దీక్షలో కూర్చోంది. అది కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటినుంచే దీపికాని, అలాగే బాలీవుడ్ “లిబరల్” గ్యాంగ్ ని బీజేపీ టార్గెట్ చేసిందని అంటున్నారు.

ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు సరిగ్గా బీజేపీ ప్రభుత్వానికి చేతికి చిక్కింది. ఆలా దీపికా పేరును కొన్ని ఛానెల్స్ ద్వారా లీక్ చేశారు. ఈ కేసులో దీపికా విచారణకి వెళ్తుందా అనేది చూడాలి. శ్రద్ధ కపూర్, రకుల్, సారా అలీ ఖాన్ పేర్లు ఇప్పటికి బయటికి వచ్చాయి. విచారణలో ఏమి తేలుతుంది అనేది పక్కన పెడితే ఈ లోపు వీరికి “డ్రగ్స్” మచ్చ అంటింది. ఆలా దీపికా ఇరుక్కొంది అనేది ఒక వాదన.

Advertisement
 

More

Related Stories