బొమ్మను గీస్తున్న బొమ్మ!

- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి షూటింగ్ లు లేనప్పుడు పెయింటింగ్ లు వేసేవారంట. హీరో సల్మాన్ ఖాన్ కి కూడా ఆ హాబీ ఉంది. వారి బాటలోనే నడుస్తోంది బిగ్ బాస్ భామ… దీప్తి సునయన.

ఈ భామ తాను పెయింటింగ్ లు వేస్తున్న వైనాన్ని ఫోటోషూట్ గా చిత్రీకరించి దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నీలో ఇంత టాలెంట్ ఉందా అని కొందరు కాంప్లిమెంట్ ఇచ్చారు. మరికొందరు మాత్రం… గీసిన బొమ్మని చూపించలేదు కానీ మిగతావన్నీ తెగ చూపించేస్తున్నావు అంటూ కొంటెగా కామెంట్ చేశారు.

మొత్తానికి దీప్తి సునయన ఇలా మరోసారి వార్తల్లో నిలిచింది.

దీప్తి సునయన నటిగా చేసిన సినిమాలు తక్కువే. కానీ సోషల్ మీడియా స్టార్ గా పాపులర్. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 41 లక్షల (4.1 మిలియన్) ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి.


 

More

Related Stories