కన్నడనాట కొత్త వాదన

Sanajana and Ragini

సుశాంత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆమె ప్రియురాలు రియా చక్రబొర్తి, బెయిల్ పై రిలీజైన సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ పై రిలీజ్ అవ్వడానికి కొన్ని రోజుల ముందు రియాను విడుదల చేయాలంటూ బాలీవుడ్ లో ఓ సెక్షన్ చిన్నపాటి సోషల్ మీడియా ఉద్యమం లేవనెత్తింది. సరిగ్గా ఇప్పుడు ఇలాంటిదే శాండిల్ వుడ్ లో కూడా మొదలైంది.

అనూహ్యంగా కన్నడనాట కూడా డ్రగ్స్ కోణం వెలుగుచూడ్డంతో రంగంలోకి దిగిన సీసీబీ అధికారులు.. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిమాండ్ లో ఉన్న వీళ్లకు కూడా బెయిల్ దొరకడం లేదు. దీంతో శాండిల్ వుడ్ లో కొంతమంది నటీనటులు.. రాగిణి-సంజనాపై సానుభూతి కురిపిస్తున్నారు.

కేసు విచారణ మొదలుపెట్టి ఇన్నాళ్లయినప్పటికీ కేవలం ఇద్దరు హీరోయిన్లను మాత్రమే అరెస్ట్ చేసి కాలం వెల్లబుచ్చడం బాగాలేదంటూ విమర్శలు చేస్తున్నారు కొంతమంది నటీనటులు. ఈ కేసుకు సంబంధించి రాగిణి-సంజనాను మినహా.. మరే పొలిటీషియన్ ను లేదా ఇతర హీరోను అరెస్ట్ చేయలేకపోయారని.. బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో వీళ్లను అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రాగిణి ద్వివేది మరోసారి కోర్టును ఆశ్రయించింది. జైలులో తను జారి పడ్డానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగా లేదని, ట్రీట్ మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై త్వరలోనే కోర్టు విచారించనుంది. ఈనెల 22 వరకు రాగిణికి రిమాండ్ ఉంది.

Related Stories