దర్శకుడితోనే ఆ హీరోయిన్ పెళ్లి

Desing Periyaswamy and Niranjani

గతేడాది మంచి హిట్టయిన సినిమా… ‘కనులు కనులను దోచాయంటే’. దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా రూపొందిన థ్రిల్లర్ అది. వీరికి ఫ్రెండ్స్ గా రక్షణ, నిరంజని అగత్యాన్ నటించారు.

రీతూ వర్మ ఫ్రెండ్ గా నటించిన ఆ హీరోయిన్ నిరంజని పెళ్లి చేసుకుంటోంది. ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా సెట్ లో ఆ సినిమా డైరెక్టర్ ఆమె మనసు దోచుకున్నాడట. సినిమా రిలీజైన తర్వాత ఇద్దరూ డీప్ గా ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

దర్శకుడు దేసింగ్ పెరియస్వామి, నిరంజని పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే వీరి పెళ్లి.

ఇంతకీ నిరంజని ఎవరో కాదు… ఒకప్పుడు అజిత్ హీరోగా ‘ప్రేమలేఖ’ వంటి సెన్సేషనల్ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు అగత్యన్ చిన్న కూతురు ఆమె. అగత్యన్ కి ముగ్గురు కూతుళ్లు. మొదటి కూతురు దర్శకుడు తిరుని పెళ్లాడింది. రెండో కూతురు ఫిరోజ్ అనే తమిళ్ దర్శకుడిని చేసుకొంది. ఇప్పుడు మూడో కూతురు కూడా డైరెక్టర్ నే పెళ్లాడుతోంది.

More

Related Stories