ఫ్లాపులున్నా అవకాశాలు!

Sakshi Vaidya

సాధారణంగా ఒక్క ఫ్లాప్ పడితినే అవకాశాలు రావు. ఇది సినిమా ఇండస్ట్రీ పద్దతి. సక్సెస్ వెంట పరుగులు తీస్తుంది చిత్రసీమ. ఐతే, ఇండస్ట్రీలో కొందరికి మాత్రం అదృష్టం వేరుగా ఉంటుంది. హిట్ లు లేకపోయినా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. అలాంటి వారి లిస్ట్ లో సాక్షి వైద్య ఉంది.

సాక్షి వైద్య అనే హీరోయిన్ పేరు చెప్తే ఎవరు ఆమె అని అడుగుతారు చాలామంది. ఆమెకి ఏమాత్రం పాపులారిటీ లేదు. జనంలో రిజిస్టర్ కాలేదు. కానీ మన తెలుగు నిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు.

ఈ ముంబై ముద్దుగుమ్మ అఖిల్ సరసన “ఏజెంట్” సినిమాతో పరిచయం అయింది. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన “గాండీవధారి అర్జున”లో నటించింది. అది కూడా అపజయమే. అయినా ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం దక్కింది. శర్వానంద్ సరసన నటించబోతోంది ఈ భామ.

శర్వానంద్ యువ దర్శకుడు రామ్ అబ్బరాజు తీసే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు “సామజవరాగమన”, “వివాహ భోజనంబు” వంటి చిత్రాలు తీశాడు. ఇప్పుడు శర్వానంద్ తో అలాంటి వినోదాత్మక చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్, మరో భామగా సాక్షి వైద్య నటించనుంది.

Advertisement
 

More

Related Stories