మెగా డెస్టినేషన్ వెడ్డింగ్

త్వరలోనే పెళ్లికూతురు కాబోతోంది మెగా డాటర్ నిహారిక. పెళ్లికి సంబంధించి ఆమె ఇప్పటికే షాపింగ్ స్టార్ట్ చేసింది. మేకోవర్ కూడా అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ కరోనా కాలంలో ఆమె పెళ్లి హైదరాబాద్ లోనే సింపుల్ గా జరుగుతుందని అంతా ఊహించారు. కానీ నిహారిక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు ఆమె తండ్రి నాగబాబు.

డిసెంబర్ లో నిహారిక-చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేస్తామని ప్రకటించిన నాగబాబు.. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఆలోచిస్తున్నట్టు తెలిపారు. కొన్ని ప్రాంతాల్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఓ డెస్టినేషన్ ను ఫిక్స్ చేస్తామని అన్నారు. ఈ వ్యవహారాలన్నీ ప్రస్తుతం వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని, పెళ్లి వేదికను ఎక్కడ ఫిక్స్ చేయాలనే అంశంతో పాటు.. పెళ్లికి సంబంధించిన ఇతర పనులన్నింటితో వరుణ్ బిజీగా ఉన్నాడట.

నిహారిక ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోనే జరిగింది. సిటీలోని ట్రైడెంట్ హోటల్ లో ఇటు మెగా కుటుంబ సభ్యులు, అటు చైతన్య కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. పెళ్లిని కూడా ఇలానే ఫ్యామిలీ ఎఫైర్ గా జరిపించాలని అనుకుంటోంది మెగా ఫ్యామిలీ. కాకపోతే హైదరాబాద్ లోని హోటల్ లో కాకుండా.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోంది.

Related Stories