అవిక బీ.ఎఫ్ బ్యాగ్రౌండ్ ఇదే

సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని పెళ్లి చేసుకుంటారు. లేదంటే బిజినెస్ మెన్ ను చూసుకుంటారు. హీరోయిన్ అవికా గౌర్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన వెంటనే అతడు ఏ లాంగ్వేజ్ లో హీరో అయి ఉంటాడా అని అంతా ఆరా తీశారు. లేదంటే వ్యాపారవేత్త అయి ఉంటాడని ఊహించారు. కానీ అవికా గౌర్ బాయ్ ఫ్రెండ్ ఈ రెండూ కాదు.

ఎంటీవీ రోడీస్ ఛాంపియన్ షిప్ లో రియల్ హీరోగా సెలక్ట్ అయ్యాడు మిలింద్ చంద్వానీ. జీ ఛానెల్ నిర్వహించిన ఓ టాలెంట్ షోలో కూడా ఛాంపియన్. దీనికి తోడు సామాజికవేత్తగా కూడా వర్క్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ‘క్యాంప్ డైరీస్’ అనే సంస్థను స్థాపించాడు. పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి, వాళ్లకు కావాల్సిన ట్రయినింగ్, సహాయం అందించే సంస్థ ఇది. అంతేకాదు, పేద విద్యార్థులకు ఎవరికైనా తీరని కోరికలు ఉంటే (మేక్ ఏ విష్ టైపులో) వాళ్ల కోర్కెలు కూడా తీరుస్తుంది ఈ సంస్థ.

Also Read: Avik Gor announces she has fallen in love

ఈ సంస్థలో పిల్లలకు డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు అవికా గౌర్ వచ్చింది. అప్పటికే మిలింద్ కు అవికాకు పరిచయం ఉంది. ఈ సంస్థలో జాయిన్ అయిన తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

తను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అండగా అవికా నిలిచిందని, అన్ని రకాలుగా సపోర్ట్ అందించిందని చెప్పుకొచ్చాడు మిలింద్. అవికను తను ఎప్పుడూ సెలబ్రిటీగా చూడలేదని, తను అలా బిహేవ్ చేయలేదని అంటున్నాడు.

Related Stories