హారికకు బొమ్మ చూపించిన బిగ్ బాస్

Bigg Boss Telugu 4 – Episode 15

ఈసారి రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని ప్రకటించాడు నాగ్. చెప్పినట్టుగానే శనివారం కరాటే కల్యాణిని ఇంటికి సాగనంపిన నాగ్.. ఆదివారం రెండో ఎలిమినేషన్ లో భాగంగా దేత్తడి హారికకు చుక్కలు చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే హారికకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అయితే హారిక ఎలిమినేట్ మాత్రం అవ్వలేదు. ఇంతకీ నాగార్జున, హారికను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి?

Bigg Boss Telugu 4 – Episode 15 ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికొస్తే.. ఒక్కొక్కర్ని సేవ్ అయినట్టు ప్రకటించిన నాగ్, అంతిమంగా నిలిచిన హారిక-మోనాల్ కు చెరో గాజు బీకరు లాంటిది ఇచ్చారు. ఇద్దరికీ చెరో కలర్ వాటర్ కూడా ఇచ్చారు. వీళ్లిద్దర్లో ఒకర్ని ఎలిమినేట్ చేసే అవకాశాన్ని, హౌజ్ లో ఈవారం ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వని వ్యక్తులకు అప్పగించాడు నాగ్. ఎవరి బీకరులో ఎక్కువ నీరు చేరితో వాళ్లు ఔట్ అన్నమాట. అలా హారిక ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించాడు.

దీంతో హౌజ్ లో మరోసారి ఏడుపులు అందుకున్నాయి. మోనాల్ ఎప్పట్లానే గేట్లు ఎత్తేయగా.. ఈసారి రాజశేఖర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే హారిక లగేజ్ తీసుకొని వెళ్లిపోతున్న టైమ్ లో నాగార్జున మళ్లీ ఆమెను వెనక్కి పిలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సెల్ఫ్ నామినేట్ చేసుకున్నందుకు పనిష్మెంట్ గా ఇలా ఎలిమినేషన్ వరకు హారికను తీసుకెళ్లాల్సి వచ్చిందని నాగ్ చెప్పి, హౌజ్ లో అందరికీ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు.

ఇవాళ్టి నుంచి మరో కొత్త ఎలిమినేషన్ రౌండ్ తో పాటు కొత్త గేమ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే గేమ్ లో బిగి సడలకుండా ఉండేందుకు ఈసారి మరో చిన్న ఎత్తు వేశాడు బిగ్ బాస్. హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతూ, ఈవారం ఎలిమినేషన్ రౌండ్ కు ఒక్కర్ని నామినేట్ చేసే అవకాశాన్ని కరాటే కల్యాణికి అప్పగించాడు నాగ్. దీంతో ఆమె పోతూపోతూ దేవిని నామినేట్ చేసి వెళ్లిపోయింది. దీంతో గేమ్ మరింత రసపట్టులోకి మారింది.

Related Stories