దేవర నుంచి కొత్త ఏడాది గిఫ్ట్?

Devara

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్న “దేవర” చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ తో పాటు అనేక ప్రదేశాల్లో పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చిత్రీకరిస్తున్నారు. జనవరి నెలాఖరులోపు షూటింగ్ పూర్తి చెయ్యాలనేది ప్లాన్. మరోవైపు, ఈ సినిమాకి సంబందించిన పబ్లిసిటీ పనులు కూడా మొదలుపెడతారని టాక్ నడుస్తోంది.

కొత్త ఏడాది స్పెషల్ గా జనవరి 1న కానీ డిసెంబర్ 31న కానీ ఒక వీడియో విడుదల చేస్తారని అంటున్నారు. ఆ వీడియోలో మేకింగ్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ఉంటాయట. ఐతే, ఈ విషయంలో అధికారికంగా టీం ఎలాంటి విషయం చెప్పలేదు. సోషల్ మీడియాలో, అభిమానుల చర్చల్లో ఈ మేటర్ వినిపిస్తోంది.

“దేవర” చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణ అవుతోంది. ఏప్రిల్ 5న విడుదల చెయ్యాలని టీం పట్టుదలగా ఉంది. అలాగే ఈ సినిమా పాటల ప్రమోషన్ కూడా జనవరి చివరి నుంచి మొదలుపెడతారని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నాడు. అనిరుధ్ తెలుగులో పలు సినిమాలకు సంగీతం ఇచ్చాడు కానీ ఎన్టీఆర్ మూవీకి పని చెయ్యడం ఇదే ఫస్ట్ టైం.

ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో భారీగా విడుదల చెయ్యనున్నారు. జాన్వీ కపూర్, ఎన్టీఆర్ లపై ఇప్పటివరకు పాటలు తీయలేదు. ఈ నెలలోనే ఆ పని కూడా మొదలుపెడతారు.

Advertisement
 

More

Related Stories