- Advertisement -

“మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమాకి మంచి రివ్యూలు, ప్రశంసలు దక్కడంతో విజయ్ దేవరకొండ ఆనందంగా ఉన్నాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండకి ఇది రెండో చిత్రం. దాంతో ఈ రోజు సోషల్ మీడియాలో తన తమ్ముడు రెండో చిత్రం గురించి పెద్ద లెటర్ రాశాడు. సినిమా తీసిన దర్శకుడు వినోద్ ని తెగ మెచ్చుకున్నాడు. అలాగే, రైటర్ జనార్దన్, తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ,హీరోయిన్ వర్ష బొల్లమ్మని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.
తన తమ్ముడు కథలని ఎంచుకుంటున్న పద్దతిని పొగిడాడు. అలాగే, ఈ సినిమాలో డైలాగ్ తో తన తమ్ముడికి ఒక సలహా ఇచ్చాడు. “కష్టపడు… ఏదైనా అవసరం వస్తే కాల్ చెయ్యు..” అనేది ఆ డైలాగ్.