మళ్ళీ పెళ్లి చేసుకుంటా: దేవి

‘బిగ్ బాస్ తెలుగు 4’ నుంచి ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి… తన వ్యక్తిగత జీవితం గురించి నిర్మొహమాటంగా మాట్లాడేస్తోంది. టీవీ9లో యాంకర్ గా పనిచేస్తున్న దేవి నాగవల్లి కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొంది. భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. ఐతే, అమెరికాలోనే డైవోర్స్ తీసుకొని మళ్లీ ఇండియాకి వచ్చింది. అప్పటి టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ఆమెని మళ్ళీ యాంకర్ గా అవకాశం ఇచ్చారు.

ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో మాట్లాడేస్తోంది.

“మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అందరూ అడుగుతున్నారు. చేసుకోను అని చెప్పను. ఇలాగే సింగిల్ గా ఉండిపోను. కాకపొతే, పెళ్లి చేసుకునేముందు… చాలా ఆలోచించాలి. ముఖ్యంగా నా బాబు గురించి థింక్ చెయ్యాలి కదా… సో మళ్ళీ పెళ్లి గురించి ఇప్పుడే కాంక్రీట్ గా చెప్పలేను,” అని ఉన్నదున్నట్లు చెప్పేసింది.

దేవి నాగవల్లిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కక్షగట్టి ఓటింగ్లో ఓడించారు అనేది వాస్తవం. టీవీ9 మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉన్న కోపం అది.

Related Stories