- Advertisement -

మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు పాడుతారు. పాటలు రాస్తారు. పాటల్లో కనిపిస్తారు. అది అయన స్టయిల్. చాలా గ్యాప్ తర్వాత దేవి తనే కంపోజ్ చేసి, రాసి, పాడారు. అదే… ‘బాస్ పార్టీ’ అనే పాట.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోది ఈ పాట.
“నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్టు ముడేస్కో, నువ్వు కర్చీఫ్ కట్టుకో… బాస్ ఒస్తుండు బాస్ ఒస్తుండు….” అంటూ దేవిశ్రీ ప్రసాద్ రాసిన ఈ పాట మాస్ కోసం మాస్ పద్దతిలో రాసినట్లు కనిపిస్తోంది. బాస్ పార్టీ చేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలిపే ఈ పాటని చాలా కలర్ ఫుల్ గా తీశారట. ఈ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ వేసిన సెట్ గురించి మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.