విడాకుల తర్వాత ఇలా కలిశారు

ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. ఇంకా లీగల్ గా విడాకులు రాలేదు కానీ ఎవరి దారి వారు పట్టారు. వీరికి ఇద్దరూ పిల్లలు. ఇద్దరూ అబ్బాయిలే. ఐతే, విడిపోయినా తల్లితండ్రులుగా ఇద్దరూ సమానంగా బాధ్యతలు చూసుకోవాలి, ప్రేమలు పంచాలి కదా. అందుకే, మళ్ళీ ఇద్దరూ కలిశారు.

తాజాగా వీరి పెద్ద అబ్బాయి స్కూల్ లో క్రికెట్ టీంకి కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఆ సందర్భంలో పేరెంట్స్ గా ఇద్దరూ కలిసి స్కూల్ కి వచ్చారు. పిల్లలతో ఫొటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది.

పిల్లల కోసం ఇలా కలిసినా… ఇద్దరూ మళ్ళీ కలవడం అనేది ఉండదు అనే ఇన్ సైడ్ టాక్. చాలా ఏళ్లుగా వాళ్ళు గొడవపడి చివరికి విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాకే తమ ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం. ఐతే, ఇటు ధనుష్, అటు ఐశ్వర్య

ధనుష్ త్వరలోనే తన కొత్త ‘పార్ట్ నర్’ని ప్రకటిస్తాడని టాక్.

 

More

Related Stories