ధనుష్ – కమ్ముల సినిమా ఏమైంది?

Dhanush and Sekhar Kammula

శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 2021 సెప్టెంబర్ లో విడుదలైంది. ఆ తర్వాత మూడు నెలలకు ధనుష్ హీరోగా సినిమా అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఏడాది పైనే గడిచింది. ఇంకా సినిమా మొదలు కాలేదు. ఈ సినిమా స్టేటస్ ఏంటి?

శేఖర్ కమ్ముల అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. దీన్ని పాన్ ఇండియా చిత్రంగా మలుస్తున్నారు. ఐతే, ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా కోసం గడ్డం పెంచాడు. స్వామిజీల తరహాలో అతని గడ్డం స్టయిల్ ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతే గడ్డం తీసేస్తాడు. ఆ తర్వాతే శేఖర్ కమ్ముల సినిమాకి డేట్స్ ఇస్తాడు.

ఇప్పటి ప్రకారం చూస్తే ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా ఈ ఏడాది రెండో భాగంలో ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాని ప్రకటించిన నిర్మాతలు మాత్రం ఇటీవల కొన్ని దెబ్బలు తిన్నారు. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనురాగ్ డైరెక్షన్ లో తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా తీసిన తుస్సుమంది. నాగశౌర్యతో నిర్మించిన చిత్రమూ అంతే సంగతులు అనిపించుకొంది. అందుకే, ఈసారి ఆచితూచిగా వ్యవహరించాలి అనుకుంటున్నారు.

ఐతే, ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా డిఫరెంట్. ఈ సినిమాకి ఉండే క్రేజ్ వేరు.

Advertisement
 

More

Related Stories