భార్యని ‘ఫ్రెండ్’ చేసిన ధనుష్

- Advertisement -
Aishwarya and Dhanush


ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన రెండు నెలల తర్వాత వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ‘ముచ్చటించుకున్నారు’. ఐశ్వర్య తాజాగా ఒక సాంగ్ ని డైరెక్ట్ చేశారు. ఆ పాటని రజినీకాంత్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పాటని ధనుష్ కూడా ట్విట్టర్లో షేర్ చెయ్యడం అందర్నీ ఆకర్షించింది.

ధనుష్ ఆమెని ‘ఫ్రెండ్’గా సంభోదించడం విశేషం. తన మాజీ భార్యని ‘ఫ్రెండ్’ ని చేసేశాడు ధనుష్.

“కంగ్రాట్స్ మై ఫ్రెండ్,” అంటూ ట్వీటాడు. ఐశ్వర్య కూడా అతని ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో అభిమానులు తెగ వైరల్ చేశారు. “థాంక్యూ ధనుష్…,” అని సమాధానం ఇచ్చారు.

వీరి ట్వీట్స్ ని బట్టి చూస్తే… విడిపోయిన ఈ జంట ఇక కలవదు. హృతిక్ రోషన్ – సుజానేలా ఫ్రెండ్స్ గా ఉంటారు ఇకపై. ఐతే, అభిమానులు మాత్రం ఇద్దర్ని కలిసిపొమ్మని కోరుతున్నారు. ఐశ్వర్య ఇక సినిమా మేకింగ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

 

More

Related Stories