‘సార్’గా ధనుష్

- Advertisement -
Dhanush


ధనుష్ రెండు తెలుగు చిత్రాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి… వెంకీ అట్లూరి తీస్తున్న మూవీ. ఈ సినిమాకి ‘సార్ (Sir) అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం.

శేఖర్ కమ్ముల సినిమానే ముందు ఒప్పుకున్నాడు ధనుష్. ఐతే, ఆ సినిమా కన్నా ముందు వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం కానుంది. దానికి కారణం స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేసి ఉంచాడు వెంకీ అట్లూరి.

కమ్ముల తన కథ, కథనాలు సిద్ధం చేసేందుకు చాలా టైం తీసుకుంటారు. ఆయన రైటింగ్ పై ఎక్కువ శ్రద్ద పెడుతారు అనేది అందరికి తెలిసిందే. సో, ధనుష్ ఈ మూవీ ముందు మొదలుపెడుతున్నారు. ఈ కథ మొత్తం చదివి దానికి తగ్గ మార్పులు, చేర్పులు చేశారు త్రివిక్రమ్. ఆయన కూడా ఈ సినిమాకి నిర్మాత.

2022లోనే మొదలుపెట్టి అదే ఏడాది విడుదల చెయ్యాలనేది ప్లాన్.

 

More

Related Stories