ధనుష్ కి మంచి ఓపెనింగే

Sir

హీరో ధనుష్ కి తెలుగు మార్కెట్ లో మంచి మార్కెట్ ఉందని అర్థమైంది. ఆయన నటించిన ‘సార్’ సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. ధనుష్ గతంలో నటించిన అనేక డబ్బింగ్ చిత్రాలతో పోల్చితే ఈసారి తెలుగులో వచ్చిన కలెక్షన్లు ఎక్కువే. ఇలాగే ఇంకో రెండు రోజులు ఆడితే, కొన్నవాళ్ళు సేఫ్ అవుతారు.

దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ఈ సినిమాకి ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లోనూ సాధారణ రివ్యూస్ వచ్చాయి. టాక్ కూడా సో సోగానే వచ్చింది. ఐతే, తెలుగునాట ఓపెనింగ్ మాత్రం టాక్ కి మించి కలెక్షన్లు రావడం విశేషం.

ఈ సినిమా లాభాల్లోకి వస్తే ధనుష్ నెక్స్ట్ మూవీకి డిమాండ్ ఉంటుంది. దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు ధనుష్ ఇప్పటికే ఒప్పుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే మొదలవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

సహజంగానే శేఖర్ కమ్ములకి దర్శకుడిగా బాగా క్రేజ్ ఉంది. ఇప్పుడు ధనుష్, కమ్ముల సినిమాకి మరింత క్రేజ్ వచ్చేలా ఉంది.

Advertisement
 

More

Related Stories