- Advertisement -

ధనుష్ మొదటి తెలుగు సినిమా మొదలైంది. ధనుష్ తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఐతే, శేఖర్ కమ్ముల ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదు. దాంతో, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మొదటి సినిమాని షురూ చేశాడు
“సార్” అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాని హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. జనవరి 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందట.
వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ధనుష్ ఎటువంటి హడావిడి చెయ్యకుండా సింప్లిసిటీని చూపాడు సినిమా లాంచ్ ఈవెంట్ లో.