తిరుపతిలో ధీరజ్ డిస్ట్రిబ్యూషన్

- Advertisement -
Dheeraj Mogilineni

ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన ప్రొడ్యూసర్ గానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా విజయం సాధించారు.

బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి సినిమాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు ధీరజ్ మొగలినేని.

ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు ధీరజ్ మొగిలినేని.

ప్రస్తుతం ఆయన శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’, సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’తో పాటు మరికొన్ని చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

 

More

Related Stories