‘దమ్ మసాలా’ రుచి బానే ఉంది!

Dum Masala

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా విషయమై ఆ మధ్య అనేక ఇబ్బందులు తలెత్తాయి. సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తప్పుకుంటున్నారంటూ రూమర్స్ వినిపించాయి.

ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. పూజాహెగ్డే స్థానంలో శ్రీలీల…. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ దమ్ మసాలా సాంగ్‌ను త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 07న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సాంగ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో అర్జెంట్ గా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. “దమ్ మసాలా” సాంగ్‌లో మసాలా ఘాటు కాస్త ఎక్కువగానే ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈ పాట ట్యూన్ బాగుందంటున్నారు.

ప్రస్తుతం సోషల్.. అటు యూట్యూబ్‌లో ఇదే హడావుడి నడుస్తోంది.

మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిరాశపర్చలేదు అని చెప్పాలి. ఐతే, ఫుల్ సాంగ్ వింటే గాని ఈ “దమ్ మసాలా” అసలైన ఘాటు రుచి తెలుస్తుంది. ఇది శాంపిల్ మాత్రమే.

Advertisement
 

More

Related Stories