డ్రగ్స్ ఆరోపణలు ఖండించిన దియా

Dia Mirza

సుశాంత్ కేసు డ్రగ్స్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. వీళ్లకు ఎన్సీబీ నోటీసులు ఇవ్వకపోయినా, సరైన సాక్ష్యాలు లేకపోయినా జాతీయ మీడియాలో మాత్రం రోజుకో పేరు తెరపైకొస్తోంది. వరుసగా కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో మీడియాకెక్కిన మరో హీరోయిన్ దియా మీర్జా.

గతేడాది జరిగిన ఓ పార్టీలో దియా మీర్జా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు ఓ జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. సుశాంత్ మేనేజర్ కు, రియా చక్రబొర్తికి దియాతో మంచి సంబంధాలున్నాయనేది ఆ కథనంలో కీలక అంశం. తనపై కథనాలు వచ్చిన వెంటనే దియా రియాక్ట్ అయింది.

తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోవడం లేదా మరో రూపంలో సరఫరా చేయడం లాంటివి చేయలేదని దియా మీర్జా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇన్నేళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరును చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకునే హక్కు భారతీయురాలిగా తనపై ఉందని ఆమె తెలిపింది.

ఇప్పటికే దీపిక పదుకోన్, సారా అలీఖాన్ లాంటి పలువురు హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వీటికి అదనంగా దియా మీర్జా పేరు కూడా వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం నాగార్జున సరసన “వైల్డ్ డాగ్” అనే సినిమాలో నటిస్తోంది దియా మీర్జా.

Related Stories