దియా మీర్జా రెండో పెళ్ళి

Dia Mirza

దియా మీర్జా మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. నేడు ముంబైలో ఆమె పెళ్లి వేడుక జరగనుంది. ముంబైకి చెందిన వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తని ఆమె పెళ్లి చేసుకుంటోంది. 39 ఏళ్ల దియా, వైభవ్ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారట.

హైదరాబాద్ కి చెందిన దియా మీర్జా ఇంతకుముందు సాహిల్ సంఘా అనే అతన్ని పెళ్లాడింది. 11 ఏళ్ళు కలిసి ఉన్నారు. రెండేళ్ల క్రితం విడిపోయారు. ఆమె కాబోయే భర్తకి కూడా ఇది రెండో పెళ్లి. ఐతే, వైభవ్ ఆమె కన్నా నాలుగేళ్లు చిన్నవాడు.

దియా ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం… నాగార్జున హీరోగా రూపొందుతోన్న ‘వైల్డ్ డాగ్’. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది.

More

Related Stories