50+ హీరోలకు టీనేజ్ భామలెందుకు?

Dia Mirza

దియా మీర్జా మరోసారి ఉన్నదున్నట్లు మాట్లాడింది. హైదరాబాద్ కి చెందిన ఈ భామ… ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కెరీర్ కొనసాగించింది. నాగార్జున నటిస్తున్న “వైల్డ్ డాగ్” సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. 39 ఏళ్ల దియా లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలో హీరోల వైఖరి ఎలా ఉంటుందో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది.

“ఇప్పుడు సినిమా పరిశ్రమ (బాలీవుడ్)ని ఏలుతున్న హీరోలంతా 50 దాటిన వారే. కానీ వారు అందరూ 19, 20 ఏళ్ల వయసు భామలతో నటిస్తారు. వాళ్ళ కూతుళ్ళ వయసున్న భామల సరసన నటించి తాము యంగ్ తరంగ్ లమని బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అదే 35, 40 ఏళ్ల వయసున్న నటీమణులకు అస్సలు ఎలాంటి పాత్రలు ఇవ్వరు,” ఇలా ఉన్న విషయం చెప్పింది.

ఆమె బాలీవుడ్ గురించే మాట్లాడింది కానీ అది టాలీవుడ్, కోలీవుడ్ అంతటా ఇదే సీన్. 60 ఏళ్ల హీరోలు కూడా 20 ఏళ్ల భామలతో డ్యూయెట్లు పాడే సీన్ మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. విచిత్రం ఏంటంటే.. .. వేలంవెర్రి అభిమానం చూపే మన ప్రాంతంలో అవన్నీ పెద్దగా పట్టించుకోరు. వాళ్లకు వాళ్ళ అభిమాన హీరో ఎప్పుడూ “యంగ్ మ్యానే”.

Advertisement
 

More

Related Stories