ఆయనతో నటిస్తే చాలు: దియా

Dia Mirza


బాలీవుడ్ సీనియర్ నటి దియా మీర్జాకి రెండే కలలున్నాయట. ఒకటి నాగార్జునతో నటించడం, మరోటి వెంకటేష్ సరసన కనిపించడం. ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ఒక కల నెరవేరింది. రెండో కల నెరవేరితే చాలు అంటోంది దియా మీర్జా.

39 ఏళ్ల దియా మీర్జా ఇటీవలే రెండో పెళ్లి చేసుకొంది. పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందట. కెరియర్ పరంగా కూడా బాగుంటే ఆమె ఆనందం రెట్టింపు అవుతుంది. ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ తర్వాత సీనియర్ హీరోల సరసన ఆమె బెస్ట్ చాయిస్ అని రెగ్యులర్ గా తీసుకుంటారా, లేదా అనేది చూడాలి. దానికన్నా ముందు ‘వైల్డ్ డాగ్’ హిట్ కావాలి. అప్పుడే టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆమె గురించి ఆలోచిస్తారు.

నిజానికి వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలకు సరైన జోడీని సెలెక్ట్ చెయ్యడం దర్శక, నిర్మాతలకు కష్టం అవుతుంది. దియాలాంటి సీనియర్ హీరోయిన్లు క్లిక్ అయితే బెటర్.

More

Related Stories