
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ సంచలనమే. ఏ హీరోయిన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో, ఏ హీరో ఎవరితో సంబంధాలు పెట్టుకున్నాడో, ఎక్కడెక్కడ సెక్స్ చేశారో వంటి విషయాలే ఉంటాయి ఈ షో నిండా. అందుకే తెగ పాపులర్ అయింది.
తాజాగా షారుక్ భార్య గౌరీ ఖాన్, అనన్య పాండే తల్లి భావన గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అనన్య పాండే ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేసిందని కరణ్ జోహార్ బయటపెట్టాడు. ఆమె తల్లి షాక్ తిన్నది.
ముందుగా గౌరీ ఖాన్ ని తన కూతురికి ఎలాంటి డేటింగ్ సలహా ఇస్తుందో అని అడిగాడు కరణ్. దానికి ఆమె సమాధానమిస్తూ “ఇద్దరి అబ్బాయిలతో డేటింగ్ లో ఉండొద్దని చెప్తాను” అని అన్నారు. “మంచి సలహా,” అని అంటూ కరణ్ అనన్య పాండే ప్రస్తావన తీసుకొచ్చారు. “నాకు తెలిసి అనన్య ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేసింది,” అని చెప్పారు కరణ్.

దానికి స్పందించిన అనన్య పాండే తల్లి భావన, “ఇద్దరిలో ఎవరితో డేటింగ్ కి వెళ్లాలో కన్ఫ్యూజన్లో బ్రేకప్ చెప్పినట్లు ఉంది,” అని ఆమె సమాధానం ఇచ్చారు.
బాలీవుడ్ హీరో ఇషాన్ కట్టర్ తో అనన్య ఇటీవలే బ్రేకప్ చెప్పింది. ‘లైగర్’ సినిమాలో నటించింది అనన్య.