
రకుల్ ప్రీతి సింగ్ అందంగానే ఉంటుంది. అయినా ఇంకా అందం కోసం కృత్రిమ మెరుగులు దిద్దుకుంటోందట. తాజాగా ఒక ఫోటో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమె పెదవులు మునుపటి కన్నా వేరే విధంగా ఉన్నాయి. ఆకృతి మారింది. షేప్ తేడాగా ఉండడంతో ఆమె సర్జరీ చేయించుకుందని మాట్లాడుకుంటున్నారు.
హీరోయిన్లు పెదవులు ఫుల్లుగా ఉండేందుకు (పౌట్ కోసం) సర్జరీ చేయించుకుంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఈ జాబితాలోకి రకుల్ చేరిందా? అన్న డౌట్స్ వస్తున్నాయి.
రకుల్ కి ఇప్పుడు 30 ఏళ్ళు. బాలీవుడ్ లో ఎనిమిది సినిమాలు చేస్తోంది. అంటే కెరియర్ మళ్ళీ పుంజుకొంది. బాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. లాంగ్ కెరియర్ కోసం మంచి దారి వేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి సర్జరీలు చేయించకుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ అందాల భామ ఇంతవరకు ఈ ప్రచారంపై స్పందించలేదు.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క తెలుగు చిత్రం ఉంది. అదే.. ‘కొండపొలం’. వచ్చే నెల 8న విడుదల కానుంది. ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా సైన్ చేస్తుందో చూడాలి.