శ్రీలీల పాపులారిటీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఆమెదే హవా. ఏ పెద్ద సినిమా గురించి మాట్లాడినా ఆమె ప్రస్తావన వస్తోంది. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఆమె నటిస్తోంది మరి.
తాజాగా అల్లు అర్జున్ సినిమాలో కనిపించే అవకాశం వస్తే ఆమె నో చెప్పింది అని వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నిజానిజాలు సంగతి పక్కన పెడితే ఆమె ఒప్పుకోకపోవడంలో అర్థం ఉంది.
ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం ఆమెని ఐటెం సొంగ్ లో నటించమని అడిగారట. “పుష్ప” సినిమాలో “ఊ అంటావా మామ” పాటలో సమంత డ్యాన్స్ చేసింది. ఆమె చెయ్యడం వల్లే ఆ పాట అంతగా పాపులర్ అయింది. ఒక పెద్ద నటి ఐటెం సాంగ్ చేస్తేనే క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో రెండో పార్ట్ (పుష్ప 2)లో కూడా ఒక అగ్రతారని తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ భావించారట. అందుకే, ఇప్పుడు మంచి క్రేజ్ లో ఉన్న శ్రీలీలకి ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు.
కానీ శ్రీలీల ఆ అవకాశాన్ని కాదనుకుందట. ఆమెకి హీరోయిన్ గానే చాలా క్రేజ్ ఉంది. ఈ టైంలో ఐటెం సాంగ్ చెయ్యాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల సరసన హీరోయిన్ గానే నటించాలని అనుకుంటోంది ఈ భామ. అందుకే “పుష్ప 2″లో ఐటెం పాటకి నో చెప్పినట్లు ఉంది.
ALSO CHECK: Sreeleela nails off the shoulder gown look