
త్వరలో విడుదల కానున్న ‘వరుడు కావలెను’ సినిమా నుంచి ఇటీవల ‘దిగు దిగు నాగ’ అన్న పాట విడుదలైంది. ఈ జానపద ట్యూన్ బాగా క్లిక్ అయింది. వైరల్ గా మారింది. దాంతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ పాట రాసిన రచయిత అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదైంది.
ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ నాయకురాలు బిందు రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు, నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
నిజానికి ఇది ఒక జానపద శైలిలో సాగే భక్తి గీతం. అది జనబాహుళ్యంలో ఉంది. ఆ పాటని అనంత శ్రీరామ్ కొంత మార్చారు. ఐతే, హిందువులు ఎంతో భక్తిప్రవత్తులతో కొలిచే నాగదేవతని కించపరిచే విధంగా ఈ పాట లిరిక్ ఉందని బీజేపీ నాయకురాలు అంటున్నారు. మరి ఈ వివాదంతో పాట మారుస్తారా అన్నది చూడాలి.
ఈ పాట యూట్యూబ్ లో ఇప్పటికే 5 మిలియన్ల వ్యూస్ దాటింది.