
దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఒక ఇమేజ్ ని పొందారు. నిర్మాతల్లో స్టార్ ఆయన. ఇక బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఆయన వరుసగా అక్కడ సినెమాలను ప్లాన్ చేశారు. లైన్ లో మూడు సినిమాలను పెట్టారు. వాటిలో మొదటిది… జెర్సీ.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ గత శుక్రవారం విడుదలైంది. కనీస స్థాయిలో ఓపెనింగ్ రాలేదు. ఘోరమైన పరాజయం. మొదటి అడుగులోనే ఆయనకి ఎదురుదెబ్బ.
బాలీవుడ్ ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయమవ్వాలనే ఉద్దేశంతో షాహిద్ కపూర్ వంటి పెద్ద హీరోతో సినిమా నిర్మించారు. అదీ కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాన్ని రీమేక్ చేశారు. కానీ, ఫలితం మాత్రం నెగెటివ్ గా వచ్చింది. ప్రస్తుతం హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా ‘హిట్’ (తెలుగు ‘హిట్’ చిత్రానికి రీమేక్) విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన బ్యానర్ నుంచి వచ్చే నెక్స్ట్ హిందీ మూవీ ఇదే.
మొదట్లో అపజయాలు ఎదురైనా… భయపడకుండా వెల్దామనే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు.
దిల్ రాజు, బాలీవుడ్, జెర్సీ,