నిఖిల్ తో గొడవలేదు: దిల్ రాజు

Dil Raju


హీరో నిఖిల్ సినిమాని తాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు అని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తెలిసీ తెలియని మీడియా వార్తలు రాసి తమ మధ్య సమస్య సృష్టించేందుకు ట్రై చేశాయన్నారు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడారు.

‘కార్తికేయ 2’ సినిమా నిజానికి జులై 22న విడుదల కావాలి. కానీ, నిర్మాత దిల్ రాజు తన ‘థాంక్యూ’ చిత్రాన్ని జులై 8 నుంచి 22కి మార్చారు. దాంతో, ‘కార్తికేయ 2’ జులై 5 వైపు మొగ్గు చూపింది. కానీ, ఆ డేట్ కి ‘బింబిసార’, ‘సీతారామం’ ఉండడంతో తన చిత్రాన్ని నిఖిల్ ఆగస్టు 13కి పంపించాడు. ఐతే, సరైన థియేటర్లు దొరకలేదు. ఇప్పుడు సినిమా విడుదలై విజయం సాధించింది.

“తమ డేట్స్ మార్చుకోవాలని విషయాన్నీ ముందే నిఖిల్ కి, నిర్మాతలకు చెప్పాం. నిఖిల్ తో నాకు ఏ గొడవా లేదు. అతను హ్యాపీడేస్ నుంచి తెలుసు. దర్శకుడు మాకు కావాల్సిన వాడే. నిర్మాతలతోనూ స్నేహాలున్నాయి. మా మధ్య లేని గొడవలను ఉన్నట్లు యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని మీడియా సైట్లు చిత్రీకరించాయి,” అని దిల్ రాజు అన్నారు.

మంచి సినిమాని తాను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తానని అంటున్నారు.

 

More

Related Stories